Daily Gospe l Daily Reflections |అనుదిన దివ్యపూజ పఠనం(20.07.2019 )|

మత్తయి సువార్త 12:14-21

 

14. పరిసయ్యులంతట వెలుపలికి వెళ్లి, ఆయనను ఎట్ల అంత మొందింతుమా!' అని కుట్ర చేయసాగిరి.
15. యేసు అది గ్రహించి, అచటి నుండి వెడలిపోయెను. అనేకులు ఆయనను వెంబడించిరి. రోగులనెల్ల ఆయన స్వస్థపరచి
16. తనను గూర్చి తెలుపవలదని వారిని ఆజ్ఞాపించెను.
17. యెషయా ప్రవచనము ఇట్లు నెరవేరెను. అది ఏమన:
18. "ఇదిగో! ఇతడు నా సేవకుడు, నేను ఎన్నుకొనినవాడు, నాకు ప్రియమైనవాడు. ఇతనిని గూర్చి నేను ఆనందించుచున్నాను. ఇతనిపై నా ఆత్మను ఉంచెదను. ఇతడు అన్యులకు నా న్యాయమును ప్రకటించును.
19. వివాదములాడడు, కేకలు వేయడు, వీధులలో ఎవరును అతని స్వరమును వినరు.
20. నలిగిన రెల్లునైన విరువడు. రెపరెపలాడుచున్న దీపమనార్పడు. న్యాయమునకు విజయము చేకూర్చునంత వరకు పట్టువిడువడు.
21. జాతులు అతని నామమును విశ్వసించెదరు."

Add new comment

2 + 16 =