Daily Gospe l Daily Reflections |అనుదిన దివ్యపూజ పఠనం(19.07.2019 )|

మత్తయి సువార్త 12:1-8

 

1. పిమ్మట యేసు ఒక విశ్రాంతి దినమున పంట పొలములో పోవుచుండ శిష్యులు ఆకలిగొని వెన్నులను త్రుంచి, తినసాగిరి.
2. పరిసయ్యులు అది చూచి, "ఇదిగో! నీ శిష్యులు విశ్రాంతి దినమున నిషేధింపబడిన పనిని చేయుచున్నారు" అని యేసుతో పలికిరి.
3. అందుకు ఆయన వారితో “దావీదు, అతని అనుచరులు ఆకలిగొనినపుడు ఏమి చేసినది మీరు చదవలేదా?
4. దేవుని మందిరములో ప్రవేశించి, అర్చకులు తప్ప, తాను కాని, తన అనుచరులు కాని తినకూడని, అచట నుండు నైవేద్యపు రొట్టెలను అతడు అతని అనుచరులు తినిరి గదా!
5. దేవాలయములో యాజకులు విశ్రాంతి దినమున విశ్రాంతి నియమమును ఉల్లంఘించినప్పటికిని, నిర్దోషులగుచున్నారని ధర్మశాస్త్ర మందు మీరు చదువలేదా?
6. దేవాలయము కంటె అధికుడగువాడు ఇక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను.
7. నేను కనికరమును కోరుచున్నాను, బలిని కాదు. అను వాక్యమునందలి భావమును మీరు ఎరిగిన యెడల నిర్దోషులను మీరిట్లు నిందింపరు.
8. ఏలన మనుష్యకుమారుడు విశ్రాంతి దినమునకు అధిపతి" అనెను.

Add new comment

1 + 5 =