మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు కూడా ప్రభువై ఉన్నాడు

కనికరమునే కోరుచున్నాను
Image source: Find the Shepherd

మత్తయి సువార్త 12: 1- 8

 

ఆకాలమందు యేసు విశ్రాంతిదినమున పంటచేలలో పడి వెళ్లుచుండగా ఆయన శిష్యులు ఆకలిగొని వెన్నులు త్రుంచి తినసాగిరి.
పరిసయ్యులదిచూచి ఇదిగో, విశ్రాంతిదినమున చేయకూడనిది నీ శిష్యులు చేయుచున్నారని ఆయనతో చెప్పగా
ఆయన వారితో ఇట్లనెనుతానును తనతో కూడ నున్నవారును ఆకలిగొని యుండగా దావీదు చేసిన దానిగూర్చి మీరు చదువ లేదా?
అతడు దేవుని మందిరములో ప్రవేశించి, యాజకులే తప్ప తానైనను తనతో కూడ ఉన్నవారైనను తినకూడని సముఖపు రొట్టెలు తినెను.
మరియు యాజ కులు విశ్రాంతిదినమున దేవాలయములో విశ్రాంతిదిన మును ఉల్లంఘించియు నిర్దోషులై యున్నారని మీరు ధర్మశాస్త్రమందు చదువలేదా?
దేవాలయముకంటె గొప్ప వాడిక్కడ నున్నాడని మీతో చెప్పుచున్నాను.
మరియుకనికరమునే కోరుచున్నాను గాని బలిని నేను కోరను అను వాక్యభావము మీకు తెలిసియుంటే నిర్దోషులను దోషులని తీర్పు తీర్చకపోదురు.
కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువైయున్నాడనెను.

Add new comment

1 + 9 =