అనుదిన దివ్యపూజ పఠనం | Daily Reflections (30.06.2019)

లూకా సువార్త 15:3-7

 

3. అపుడు యేసు వారికి ఒక ఉపమానమును ఇట్లు చెప్పెను;
4."ఒకడు తనకు ఉన్న నూరు గొఱ్ఱెలలో ఒకటి తప్పి పోయినచో, తక్కిన తొంబది తొమ్మిదింటిని ఆ అరణ్యముననే విడిచిపెట్టి దానిని వెదకుటకై పోవునుగదా!
5. అది దొరికిన పిమ్మట వాడు సంతోషముతో దానిని భుజములపై వేసికొని, యింటికి తీసికొని వచ్చి తన మిత్రులను, ఇరుగు పొరుగు వారిని పిలిచి,
6. తప్పిపోయిన నా గొఱ్ఱెదొరకినది. నాతోపాటు ఆనందింపుడు' అని చెప్పును .
7.అట్లే పశ్చాత్తాపము అవసరము లేని తొంబది తొమ్మిది మంది నీతిమంతుల కంటె, హృదయ పరివర్తన పొందు ఒక పాపాత్ముని విషయమై పరలోకమున ఎక్కువ ఆనందము ఉండునని" నేను మీతో చెప్పుచున్నాను.

Add new comment

4 + 2 =