అనుదిన దివ్యపూజ పఠనం | Daily Reflections (29.06.2019)

మత్తయి సువార్త 16:13-19

 

13. తరువాత యేసు, ఫిలిప్పు కైసరయా ప్రాంతమునకు వచ్చెను. "ప్రజలు మనుష్య కుమారుడు ఎవ్వరని భావించుచున్నారు?" అని తన శిష్యులను ఆయన అడిగెను.
14. అందుకు వారు "కొందరు బప్తిస్మ యోహాను అని, కొందరు ఏలియా అని, మరికొందరు యిర్మీయా లేక ప్రవక్తలలో ఒకడని చెప్పుకొనుచున్నారు" అనిరి.
15. "మరి నేను ఎవరని మీరు భావించు చున్నారు?" అని యేసు వారిని అడిగెను.
16. అందుకు సీమోను పేతురు, "నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువు" అని సమాధానమిచ్చెను.
17. "యోనా పుత్రుడవగు సీమోనూ! నీవు ధన్యుడవు. నీకు ఈ విషయమును తెలియజేసినది పరలోక మందున్న నా తండ్రియే కాని, రక్తమాంసములు కావు.
18. నీవు పేతురువు, ఈ రాతి మీద నా సంఘమును నిర్మించెదను. నరక శక్తులు దీనిని జయింపజాలవు.
19. నేను నీకు పరలోక రాజ్యపు తాళపు చెవులను ఇచ్చెదను. భూలోకమందు నీవు దేనిని బంధింతువో, అది పరలోకమందు బంధింప బడును; భూలోకమందు నీవు దేనిని విప్పుదువో, అది పరలోకమందు విప్పబడును."

Add new comment

4 + 11 =