అనుదిన దివ్యపూజ పఠనం | Daily Reflections (16.07.2019)

మత్తయి సువార్త 11:20-24

 

20. అపుడు యేసు తాను అనేక అద్భుతములను గావించిన పట్టణములను ఖండింప నారంభించెను. ఏలన, వారిలో పరివర్తన కలుగలేదు.
21. "అయ్యో! ఓ కొరాజీను పురమా! అయ్యో! బెత్సయిదా పురమా! మీయందు చేయబడిన అద్భుత కార్యములు తూరు, సీదోను పట్టణములలో జరిగి యుండినచో, ఆ పురజనులెపుడో గోనెపట్టలు కప్పుకొని, బూడిద పూసికొని హృదయ పరివర్తనము పొంది యుండెడి వారే!
22. కావున, తీర్పుదినమున మీ స్థితికంటె తూరు, సీదోను వాసుల స్థితియే మేలైనదిగ నుండునని నేను మీతో చెప్పుచున్నాను.
23. ఓ కఫర్నాము పురమా! నీవు ఆకాశమునకు ఎత్తబడవలెనని ఆశింపలేదా? నీవు పాతాళమునకు పడద్రోయబడెదవు. నీయందు చేయబడిన అద్భుత కార్యములు సొదోమ పరమందు చేయబడి యున్నచో, అది నేటి వరకు నిలచి యుండెడిది.
24 తీర్పు దినమున నీ స్థితి కంటె, సొదొమ వాసుల స్థితియే మేలైనదని నీతో చెప్పుచున్నాను."

Add new comment

2 + 15 =