అనుదిన దివ్యపూజ పఠనం | Daily Reflections (15.07.2019)

మత్తయి సువార్త 10:34--11:1

 

34. "ప్రపంచమున శాంతిని నెలకొల్పుటకు నేను వచ్చినట్లు భావింపవలదు. ఖడ్గమునే కాని, శాంతిని నెలకొల్పుటకు నేను రాలేదు.
35. నా రాక, తండ్రిని కుమారుడు, తల్లిని కొమార్తె, అత్తను కోడలు ప్రతిఘటించునట్లు చేయును.
36. తన కుటుంబము వారే తనకు శత్రువులు అగుదురు.
37. తన తండ్రిని లేదా తల్లిని, నా కంటె మిన్నగా ప్రేమించువాడు నాకు యోగ్యుడు కాడు. తన కుమారుని లేదా కుమార్తెను నా కంటె మిన్నగా ప్రేమించువాడు నాకు యోగ్యుడు కాడు .
38. తన సిలువ నెత్తుకొని నన్ను అనుసరింపనివాడు నాకు యోగ్యుడుకాడు.
39. తన ప్రాణమును దక్కించుకొన యత్నించు వాడు దానిని కోల్పోవును; నా కొరకు తన ప్రాణమును కోల్పోవువాడు దానిని దక్కించు కొనును."
40. "మిమ్ము స్వీకరించువాడు నన్ను స్వీకరించు చున్నాడు. నన్ను స్వీకరించువాడు నన్ను పంపిన వానిని స్వీకరించు చున్నాడు.
41. ప్రవక్తను ప్రవక్తగా గుర్తించి స్వీకరించు వాడు, ప్రవక్త బహుమానము పొందును. నీతిమంతుని నీతిమంతుడుగా గుర్తించి స్వీకరించువాడు, నీతిమంతుని బహుమానము పొందును.
42. నా శిష్యుడని ఈ చిన్న వారలలో ఒకనికి ఎవడేని ఒక గ్రుక్కెడు మంచి నీరొసగిన వాడు తన బహుమానమును పోగొట్టుకొనడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను."

11
1. యేసు పండ్రెండుమంది శిష్యులకు తన ఆదేశములనొసగిన పిదప, ఆయా పట్టణములలో బోధించుటకు, ప్రసంగించుటకు బయలుదేరెను.

Add new comment

2 + 3 =