అనుదిన దివ్యపూజ పఠనం | Daily Reflections (14.07.2019)

లూకా సువార్త 10:25-37

 

25. అంతట ఒక ధర్మశాస్త్ర బోధకుడు లేచి, "బోధకుడా నిత్య జీవము పొందుటకు నేనేమిచేయవలెను?" అని యేసును పరీక్షింప గోరి ప్రశ్నించెను.
26.అందుకు యేసు "ధర్మశాస్త్రమున ఏమని వ్రాయబడి యున్నది? అది నీ కెట్లు అర్థమగుచున్నది?" అని తిరుగు ప్రశ్న వేసెను.
27. అందుకు అతడు, " నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ మనస్సుతో ప్రేమింపుము. నిన్ను నీవు ప్రేమించుకొనునట్లే నీ పొరుగువానిని ప్రేమింపుము" అని వ్రాయబడి యున్నది" అని పలికెను.
28. "నీవు సరిగా సమాధానమిచ్చితివి. అట్లే చేయుము. నీవు జీవింతువు" అని యేసు వానితో చెప్పెను.
29.కాని అతడు తనను సమర్ధించుకొనుటకై "నా పొరుగువాడు ఎవడు?" అని యేసును అడిగెను.
30.యేసు ఇట్లు సమాధానమిచ్చెను: "ఒకానొకడు యెరూషలేము నుండి యెరికోనగరమునకు వెళ్లుచుండెను. త్రోవలో అతనిని దొంగలు చుట్టుముట్టి, దోచుకొని, గాయపరచి, కొన ఊపిరితో విడిచి పోయిరి.
31. ఆ తరువాత ఒక యాజకుడు ఆ మార్గమున వెళ్లుచు, వానిని చూచి, తప్పుకొని పోయె ను.
32. అటులనే ఒక లేవీయుడు అటు వచ్చి వానిని చూచి తొలగిపోయెను.
33. పిదప ఒక సమరీయుడు అటు పయనమై పోవుచు అతనిని చూచెను. 'వానిని చూడగనే అతడు జాలిపడి,
34. వాని దగ్గరకు వెళ్లి గాయములకు తైలము, ద్రాక్షరసము పోసి కట్టుకట్టెను. పిమ్మట వానిని తన వాహనముపై కూర్చుండ బెట్టి, ఒక సత్రమునకు తీసికొనిపోయి పరామర్శించెను.
35. అతడు మరునాడు సత్రపు యజమాని చేతిలో రెండు దీనారములు పెట్టి వీనిని పరామర్శింపుము. నీకు ఎక్కువ వ్యయమైనచో తిరిగి వచ్చిన పిమ్మట చెల్లింపగలను' అని చెప్పెను .
36.దొంగల చేతిలో పడినవానికి పై ముగ్గురిలో పొరుగువాడెవ్వడు?" అని యేసు అడిగెను.
37. "కనికరము చూపినవాడే" అని ధర్మశాస్త్ర బోధకుడు సమాధానమిచ్చెను. యేసు అతనితో "నీవు వెళ్లి అట్లే చేయుము" అని పలికెను

Add new comment

8 + 6 =