అనుదిన దివ్యపూజ పఠనం | Daily Reflections (13.07.2019)

మత్తయి సువార్త 10:24-33

 

24. 'శిష్యుడు గురువు కంటె అధికుడు కాడు. సేవకుడు యాజమాని కంటె అధికుడు కాడు.
25. గురువు వలె శిష్యుడు, యజమాని వలె సేవకుడు అయిన చాలును. ఇంటి యాజమానుడు "బెల్జబూలు" అని పిలువబడినయెడల, అతని ఇంటి వారు ఇంకెంత హీనముగా పిలువబడుదురో కదా!?
26. “కాబట్టి మనుష్యులకు భయపడకుడు. దాచబడినది ఏది బయలు పడక పోదు. రహస్యమైనదేది బట్ట బయలు కాక పోదు.
27. చీకటిలో నేను మీకు బోధించు ఈ విషయముల నెల్ల మీరు వెలుతురులో బోధింపుడు. చెవిలో మీకు చెప్పబడిన దానిని ఇంటి మీదినుండి ప్రకటింపుడు.
28. శరీరమును మాత్రము నాశము చేయగలిగి, ఆత్మను నాశము చేయలేని వారికి భయపడకూడదు. ఆత్మను, శరీరమును కూడ నరక కూపమున నాశనము చేయగల వానికి భయపడుడు.
29. ఒక కాసుతో మీరు రెండు పిచ్చుకలను కొనగలుగుదురు; కాని, మీ తండ్రి సంకల్పము లేనిదే వానిలో ఏ ఒక్కటియు నేలకు ఒరగదు.
30. ఇక మీ విషయమున మీ తల వెంట్రుకలన్నియు లెక్కింపబడియే యున్నవి.
31. కావున భయపడకుడు. మీరు అనేక పిచ్చుకల కంటెను అతి విలువైన వారు"
32. "కనుక ప్రజల యెదుట నన్ను అంగీకరించు ప్రతి వానిని, పరలోకమందున్న నా తండ్రి సమక్షమున నేను అంగీకరింతును.
33. అట్లుగాక, ప్రజల యెదుట నన్ను తిరస్కరించు ప్రతి వానిని పరలోక మందున్న నా తండ్రి సమక్షమున నేను తిరస్కరింతును."

Add new comment

5 + 4 =