అనుదిన దివ్యపూజ పఠనం | Daily Reflections (12.07.2019)

మత్తయి సువార్త 10:16-23

16. ఇదిగో తోడేళ్ళ మధ్యకు గొఱ్ఱెలను పంపినట్లు మిమ్ము పంపుచున్నాను. కనుక సర్పముల వలె తెలివితో పావురముల వలె నిష్కపటులై మెలగుడు.
17. మనుష్యులను గూర్చి జాగ్రత్తపడుడు. వారు మిమ్ము న్యాయ స్థానములకు అప్పగించి, ప్రార్థనామందిరములలో కొరడాలతో కొట్టించెదరు. వారిని మెలకువతో గమనించియుండుడు.
18. మీరు రాష్ట్రపాలకుల చెంతకు, రాజుల చెంతకు కొనిపోబడి నా నిమిత్తము అచట వారి ఎదుట, అన్యుల ఎదుట సాక్ష్యమొసగుదురు.
19. మీరు న్యాయ స్థానములకు అప్పగింపబడినపుడు ఎట్లు మాట్లాడవలెనో, ఏమి చెప్పవలెనో, అని కలత చెందకుడు. సమయోచితముగా చెప్పవలసినదెల్ల మీకు అపుడు అనుగ్రహింపబడును.
20. మీరు మాట్లాడు మాటలు మీవి కావు; మీ తండ్రి ఆత్మయే మీ నోట మాట్లాడును.
21. సోదరుడు తన సోదరుని, తండ్రి తన బిడ్డను మరణమునకు అప్పగింతురు. బిడ్డలు తల్లి దంద్రులను ఎదిరించి వారిని చంపించెదరు.
22. నా నామము నిమిత్తము మిమ్ము ఎల్లరు ద్వేషింతురు; కాని, చివరి వరకు సహించి నిలిచిన వాడే రక్షింపబడును.
23. మిమ్ము ఒక పట్టణమున హింసించినపుడు వేరొక పట్టణమునకు పారిపోవుడు. మనుష్యకుమారుడు వచ్చునప్పటికి యిస్రాయేలు పట్టణములన్నిటిని మీరు చుట్టి రాజాలరు అని మీతో చెప్పుచున్నాను.

Add new comment

17 + 1 =