అనుదిన దివ్యపూజ పఠనం | Daily Reflections (03.07.19)

యోహాను సువార్త 20:24-29

 

24 యేసు వచ్చినపుడు పన్నిద్దరిలో దిదీము అనబడు తోమా శిష్యులతో లేకుండెను.
25. తక్కిన శిష్యులు అతనితో 'మేము ప్రభును చూచితిమి" అని చెప్పిరి. అందుకు అతడు "నేను ఆయన చేతులలో చీలల గురుతు చూచి, అందు నా వ్రేలు పెట్టి ఆయన ప్రక్కలో నా చేయి ఉంచిననే తప్ప విశ్వసింపను" అనెను.
26. ఎనిమిది దినముల పిమ్మట ఆయన శిష్యులు మరల ఇంటి లోపల ఉండిరి. తోమా సహితము వారితో ఉండెను. మూసిన తలుపులు మూసినట్లుండగనే యేసు వచ్చి వారి మధ్య నిలుచుండి, 'మీకు శాంతి కలుగునుగాక!' అనెను.
27.అపుడు యేసు తోమాతో "నీ వ్రేలు ఇక్కడ ఉంచుము. నా చేతులు చూడుము. నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచుము. అవిశ్వాసివి కాక, విశ్వాసివై ఉండుము" అని చెప్పెను.
28,అపుడు తోమా 'నా ప్రభూ! నాదేవా!" అని పలికెను.
29. "నీవు విశ్వసించినది నన్ను చూచుట వలన కదా! చూడకయే నన్ను విశ్వసించువారు ధన్యులు" అని యేసు పలికెను.

Add new comment

2 + 1 =