అనుదిన దివ్యపూజ పఠనం | Daily Reflections (02.07.2019)

మత్తయి సువార్త 8:23-27

23. అంతట యేసు పడవ నెక్కగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించిరి.

24. హఠాత్తుగా గాలి వాన క్రమ్మి, పడవను ముంచెత్తు నంతటి అలలు ఆ సముద్రములో చెలరేగెను. ప్రభువు ఆ సమయమున నిదురించుచుండెను.
25. అప్పుడు శిష్యులు ఆయనను మేలుకొలిపి "ప్రభూ! మేము నశించుచున్నాము. రక్షింపుము" అని ప్రార్ధింపగ,
26. యేసు వారితో "ఓ అల్ప విశ్వాసులారా! మీరు భయపడెదరేల?” అని పలికి, లేచి గాలిని,సముద్రమును గద్దించెను. వెంటనే ప్రశాంతత చేకూరెను.
27. "గాలి, సముద్రము సైతము ఈయన ఆజ్ఞకు లోబడినవి. ఈయన ఎంతటి మహానుభావుడు!" అని జనులు ఆశ్చర్యపడిరి.

Add new comment

11 + 5 =