World Paper Bag Day |

పునరుత్పాదక పదార్థాలతో తయారయ్యేవే పేపర్ బ్యాగులు. అలాగే ఇవి భూమిలో కరిగిపోగలవు. ఇవి ఎంత మందంగా ఉన్నా కరిగిపోగలవు. భూమికి మేలు జరిగే పేపర్ బ్యాగులును మన విరివిగా వాడాలి  

ప్రతి సంవత్సరం జులై 12న ప్రపంచ దేశాలన్నీ పేపర్ బ్యాగ్ దినోత్సవాన్ని జరుపుతున్నాయి. తెల్లారితే చాలు... మనం ఏ షాపుకి వెళ్లినా... ప్లాస్టిక్ లేదా పాలిథిన్ కవర్లలోనే ఐటెమ్స్ ఇస్తుంటారు. వాడి పారేశాక... అవి భూమిలో కరగవు. అది భూమిలో కరిగిపోవడానికి వెయ్యి సంవత్సరాలు పడుతుంది. ఇలా రోజూ ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది కోట్ల ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ సంచులు, వాటర్ బాటిళ్లు వాడి పారేస్తున్నారు. ఇవి అటు తిరిగీ, ఇటు తిరిగీ చివరకు  సముద్ర గర్భంలోకి వెళ్తున్నాయి. అలాగే డ్రైనేజీ మురికి కాలువలు, పరిశ్రమల వ్యర్థాలు  ఇలా అన్నీ సముద్రంలో కలుస్తున్నాయి. ఎలా చేయడం వలన  సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి. కొన్ని సార్లు  జల ప్రళయలుగా  తీర ప్రాంత నగరాల్ని కబళిస్తోంది. దీనికి చెక్ పెట్టాలంటే ప్లాస్టిక్ వాడకం తగ్గించి... పేపర్ బ్యాగుల్ని (paper bags) వాడాలన్నది ప్రపంచ దేశాల సందేశం.

ఈ పాలిథిన్ కవర్ల బదులు మనమే పేపర్ బ్యాగులు వాడితే బాగుంటుందనే ప్రచారం మొదలైంది. వీటి వల్ల పర్యావరణానికి కాలుష్యం పెద్దగా ఉండదు. పైగా... ఇవి భూమిలో త్వరగా కరిగిపోతాయి.