మనల్ని ఎవరు కాపాడతారు ?

Who will save us?
Fight Corona with God

మనల్ని ఎవరు కాపాడతారు ?

 

మనం ఇప్పుడు తపస్కాలంలో ఉన్నాం. మన పాపాలకు మనస్తాపం చెంది ఆ దేవుని క్షమాపణను కోర వలసిన సమయం ఇది.  ఇటువంటి సమయంలో ప్రపంచమంతా శోక సముద్రంలో, భయాందోళనలో, అనిశ్చిత స్థితిలో కొట్టుమిట్టాడుతూఉంది.

మరణం ఎటునుండి వస్తుందో, ఏ రూపంలో వస్తుందో, ఎవరిని కబళిస్తుందో తెలియని అయోమయంలో ప్రపంచం వణికిపోతోంది. ఈ సమయంలో మనల్ని కాపాడేది ఎవరు? వైద్యులా? మందులా ? పరిశుభ్రతా? జాగ్రత్తలా?

వీటన్నికంటే ముందు దేవుని పట్ల మనకున్న విశ్వాసం, భయ భక్తులు మనల్ని కాపాడుతాయి

కీర్తనలు 91 : 9 - 10 లో చెప్పబడినట్లు, "యెహోవా, నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసికొనియున్నావు
నీకు అపాయమేమియు రాదు ఏ తెగులును నీ గుడారమును సమీపించదు". మనం ఎప్పుడైతే మన ప్రభువు పై పరిపూర్ణ విశ్వాసముతో, ఆయనే మన ఆశ్రయం గా జీవిస్తామో అప్పుడు మనల్ని ఎటువంటి రోగం తాకాదు

వ్యాధి బాధలనుండి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి అనే జ్ఞానాన్ని జ్ఞానమునకు మూలమైన ఆ ప్రభువు దయచేస్తాడు. ఈ విపత్కర పరిస్థితులలో మనం వీలనంతవరకు మన పాపాలకు పశ్చాత్తాపపడుతూ ఆ దేవుని దయ కోసం ప్రార్ధించాలి

మన ప్రభువు సులభముగా కోపపడువాడు కాదు

కీర్తనలు 91 : 15 - 16 లో ప్రభువు మనకు వాగ్దానం చేసినట్లు మనం ఆయనకు మొరపెడితే ఆయన మనకు సమాధానం ఇస్తారు
మన శ్రమలలో మనకు తోడుగా  ఉంటారు
మన శ్రమలనుండి మనల్ని విడిపించి, మనల్ని గొప్ప చేస్తారు
తన రక్షణమును మనకు చూపించి దీర్ఘాయువుతో మనల్ని దీవిస్తారు

ప్రపంచమంతా పాపం పెచ్చరిల్లుతున్న తరుణంలో దేవుడు మనకు ఇస్తున్న ఒక మంచి అవకాశం ఇది.  ఇళ్లలోనుండి బైటకు రావద్దని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి, అదేవిధంగా మన పాపాలనుండి బయటకు రమ్మని దేవుడు సూచిస్తున్నాడు. ఈ తరుణంలో వ్యక్తిగత శుభ్రత పాటించటం చాల ముఖ్యమని  వైద్యులు సూచిస్తున్నారు. కానీ మనస్సును శుభ్రపరుచుకోవడానికి ఇది చాలా మంచి సమయమని పరమ వైద్యుడైన ప్రభువు మనకు సూచిస్తున్నారు

ఇప్పుడు మనం చెయ్యవలసిన అతి ముఖ్యమైన పని, మన గృహాలలోనుండి బైటకు రాకుండా మన పాపాలకు పశ్చాత్తాపపడుతూ వాటినుండి బైటకు రావాలి. క్రీస్తు పునరుత్థాన పండుగ నాటికి మనం పూర్తిగా పరివర్తన చెందిన మనసులతో ఒక క్రొత్త మనిషిగా తిరిగి జన్మించాలి

కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, మనందరం క్రీస్తు శ్రమలకు, పునరుత్తానికి, శారీరకంగా మానసికంగా సన్నద్ధమై ఆ ఉత్థాన క్రీస్తును మన జీవితాలలోకి ఆహ్వానించి, సకల కీడులనుండి, రోగములనుండి, బాధలనుండి కాపాడాలని ప్రార్థిద్దాం    ఆమెన్ 

Add new comment

3 + 1 =

Please wait while the page is loading