మనుషుల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ఏకమైన మహిళలు

Talitha kum against Human trafficking
Women unite against Human trafficking

మనుషుల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ఏకమైన మహిళలు

తూర్పు మధ్యధరా ప్రాంతంలో మనుషుల అక్రమ రవాణా ను ద్రుష్టి లో పెట్టుకొని తయారు చేసిన లఘు  చిత్రమే "వెల్స్ అఫ్ హోప్". యుద్ధాలు వాటి వలన ఆ దేశాలనుండి వలస వెళ్లిన వారి అసహాయతను ఆసరాగా తీసుకొని కొందరు వారిని ఇతర దేశాలకు వేశ్యలుగా మరియు వారి అవయవాల కోసం అక్రంగా రవాణా చేస్తూ వ్యాపారాన్ని చేస్తున్న ఉండటాన్ని ఈ చిత్రంలో చూపించారు.

ఈ లఘు చిత్రంలో వివిధ మతాలకు చెందిన కొందరు అరబ్బు దేశ మహిళలు, తలితాకుమ్ సంస్థ ద్వారా సహాయాన్ని పొందుతూ మానవ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ఎలా పోరాడుతున్నారు? రవాణాకు గురి అవుతున్న వారిలో అవగాహన తీసుకురాడవం ప్రధమ ఉద్దేశంగా వీరు ఎలా పని చేస్తున్నారు అనే విషయాలు చూపించునట్లు చిత్ర దర్శకులు లియా  బెల్ట్రామి చెప్పారు.

ఈ చిత్రాన్ని వాటికన్ లో చిత్రీకరించామని, ఈ లఘు చిత్రం ద్వారా మమ్మల్ని పట్టించుకునేవారే లేరు అనుకునే నిర్భాగ్యులైన స్త్రీలకు అండగా మేమున్నామని సందేశాన్ని ఇవ్వాలనుకున్నామని, అంతేకాకుండా ఈ మహోద్యమం కోసం తమ ప్రాణాలను సైతం లెక్కచెయ్యకుండా పోరాడే వాళ్ళు ఉన్నారనే సందేశాన్ని ఇవ్వాలనుకున్నామని లియా చెప్పారు.

తూర్పు మధ్య ప్రాంతాలలో తలితాకుం సంస్థ నేతృత్వం కొందరు కన్యాస్ట్రీలు నడుపుతున్న కార్యక్రమం పేరే "వెల్స్ అఫ్ హోప్". కొందరు మాఫియా వారు చేస్తున్న మనుషులను అక్రమంగా రవాణాకు వ్యతిరేకంగా వీరు పోరాడుతున్నారు.

ఈ సమస్య గురించి అవగాహన పనిన మేము ఎక్కువగా ద్రుష్టి పెట్టాం ఎందుకంటే మన దేశాలలో ఇటువంటి సమస్య చాలా తక్కువగా చూస్తాం. ఇక్కడివారికి ఈ సమస్య గురించి అవగాహన కల్పించి దారిద్య్రంలో అట్టడుగున మగ్గిపోతున్న వారికి సహాయం చెయ్యడమే మా ముఖ్య ఉద్దేశం అని దర్శకులు లియా  బెల్ట్రామి అన్నారు.

తూర్పు మధ్య ప్రాంతంలో సుమారు 20 లక్షల మంది ఇటువంటి బాధితులు ఉన్నారని అంచనా. వారిలో అధిక శాతం మైనర్ బాలికలు మరియు విధవరాండ్రే.

మనం ప్రత్యక్షంగా ఏమి చేయలేకపోయినా వారికోసం, వారిని కాపాడమని ఆ దేవుని ప్రార్థిద్దాం.

 

Article abstracted from the link below:

https://www.romereports.com/en/2020/03/17/women-of-all-religions-unite-against-human-trafficking/  

Add new comment

5 + 0 =

Please wait while the page is loading