దివికేగిన సుష్మమ్మ.. శోక సంద్రంలో బీజేపీ శ్రేణులు

 బీజేపీ సీనియర్ నేత, కేంద్ర విదేశాంగ మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ మంగళవారం రాత్రి హార్ట్ అటాక్‌ కారణంగా మరణించారు. గత ఐదేళ్ల కాలంలో విదేశాంగ మంత్రి అద్భుత పనీతీరు కనబర్చిన ఆమె ఇక లేరనే వార్త తెలియగానే.. సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా దేశ ప్రజలంతా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనయ్యారు. గుండె పోటు రాగానే ఆమెను ఎయిమ్స్‌కు తరలించి చికిత్స అందించారు. ఐదుగురు సభ్యుల డాక్టర్ల బృందం ఆమెను బతికించేందుకు చేసిన ప్రయత్నాలేవి ఫలించలేదు. దీంతో ఆమె ఈ లోకాన్ని వదిలి వెళ్లారు. 

Add new comment

6 + 4 =

Please wait while the page is loading