కరోనా బాధితులకోసం ఫ్రాన్సిస్ పాపు గారితోపాటు జపమాలను జపించిన యావత్ కథోలిక సమాజం

Pope prays rosary for corona infected
Pope prays rosary for corona infected

కరోనా బాధితుల కోసం ఫ్రాన్సిస్ పాపు గారితోపాటు జపమాలను జపించిన యావత్ కథోలిక సమాజం.

కరోనా వైరస్ బారిన పడి బాధ పడుతున్న వారికోసం యావత్ కథోలిక సంఘం ఫ్రాన్సిస్ పాపు గారితో కలిసి మార్చి 19 న జపమాలను జపించింది.

కరోనా మహమ్మారి నుండి విడుదల కోసం ప్రభువును వేడుకుంటూ ఇటలీ మేత్రాణుల ఆధ్వర్యంలో ఈ జపమాలను జపించడం జరిగింది. అంతకు క్రితం రోజు పాపు గారు కూడా ఈ జపమాలలో పాల్గొని తన ఏకీభావాన్ని తెలుపుతానని తన సందేశంలో వ్యక్తం చేసారు. 

ఇటలీ లోని ప్రజలందరూ కూడా తమ ఇళ్లలో మరియు కిటికీలలో వెలిగించిన క్రొవొత్తులను ఉంచి జపమాలను ప్రార్ధించాలని ఇటలీ మెట్రానుల సమాఖ్య కోరింది. పాపు గారి సంఘీభావంతో ఈ వార్త సామాజిక మాధ్యమాల ద్వారా ప్రపంచమంతటా వ్యాపించి, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కథోలికులందరు ఈ జపమాలలో పాల్గొన్నారు.

కరోనా వైరస్ వల్ల అత్యధిక మంది మరణించింది ఇటలీలోనే కావడం వల్ల పాపు గారు వారికోసం ప్రత్యేకంగా ప్రార్ధించాలని కాథోలికులందరినీ కోరారు.

ఇటలీ వాసులు మరియు యావత్ప్రపంచం ఈ కరోనా మహమ్మారి నుండి విడుదల పొందాలని మనందరం ప్రార్ధిద్దాం.

Article Abstracted from : https://www.rvasia.org/catholics-join-pope-praying-rosary-coronavirus-victims 

Add new comment

4 + 4 =

Please wait while the page is loading