ఆశ్చర్యకర సిలువ వద్ద ప్రార్ధించిన పాపు గారు

Story of the Miraculous Crucifix
pope prays at the Miraculous Crucifix

ఆశ్చర్యకర సిలువను సందర్శించి కరోనా వైరస్ ను అరికట్టమని ప్రార్ధించిన ఫ్రాన్సిస్ పాపు గారు.

రోము నగరం లో ఎంతో విలువైన "ఆశ్చర్యకర సిలువ" ఉన్న దేవాలయాన్ని ఫ్రాన్సిస్ పాపు గారు గత మంగళవారం సందర్శించారు. ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ అంతం కావడానికి సహాయం చెయ్యమని పాపు గారు ఆ సిలువ వద్ద ప్రార్ధించారు.

16 శతాబ్దంలో కూడా ఈ సిలువ రోము నగరాన్ని కాపాడిందని, 1522 లో రోము నగరం భయంకరమైన ప్లేగు వ్యాధితో సతమతమౌతుండగా, ఈ సిలువను 16 రోజులు రోము నగర పురవీధులలో ప్రదక్షిణగా తిప్పారని, వెంటనే ప్లేగు వ్యాధి వ్యాపించడం ఆగిపోయిందని పాపు గారు గుర్తు చేసారు.

ప్లేగు వ్యాధి ఆగిపోయిన 500 సంవత్సారాల తర్వాత మరలా ఇప్పుడు ఫ్రాన్సిస్ పాపు గారు ఈ సిలువను సందర్శించి, కరోనా వ్యాధి ఆగిపోవాలని ప్రార్ధించారు.

1600 సంవత్సరంలో పదవ ఇన్నోసెంట్ పాపుగారు జూబిలీ కోసం ఈ సిలువను  సెయింట్ పీటర్స్ బసిలికాకు తీసుకొని వచ్చారు. మరలా 2000 సంవత్సరంలో రెండవ జాన్ పాల్ పాపు గారి నేతృత్వంలో జరిగిన పవిత్ర క్షమాపణ దినానికి ఈ సిలువను తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఫ్రాన్సిస్ పాపుగారు కరోనా వైరస్ సమూలంగా నశించాలని ఈ సిలువ వద్ద ప్రార్ధనలు జరిపారు.

మనం కూడా ఫ్రాన్సిస్ పాపు గారి ప్రార్ధనతో ఏకీభవించి కరోనా వైరస్ నశించాలని మన మనస్సులలో ఆ ఆశ్చర్యక సిలువదారి అయిన క్రీస్తు ప్రభువును ప్రార్ధిద్దాం.

 

Article abstracted from the following link:

https://www.romereports.com/en/2020/03/16/story-of-miraculous-crucifix-where-pope-prayed-for-an-end-to-coronavirus/ 

Add new comment

4 + 0 =

Please wait while the page is loading