SAINT OF THE DAY – March 16 పునీత హెరిబెర్టు | ST. HERBERT

(ఆర్చిబిషప్పు, మతసాక్షి, క్రీ||శ|| 970-1021) జర్మనీ దేశంలో వారు పట్టణంలో పునీత హెరిబెర్డుగారు క్రీ||శ|| 970లో జన్మించారు. భక్తి విశ్వాసాలలో పెరిగారు. ఇంకా ఇంకా జ్ఞానాన్ని సంపాదించాలనే జిజ్ఞాసకలవారు. లొర్రయిను పట్టణంలో గోరె అను చోట గలమిక్కిలి ప్రసిద్ధిచెందిన ఒక గురు మఠాశ్రమంలో ఉంచబడ్డారు. అక్కడే శ్రద్ధగా చదువుకున్నారు. అక్కడున్న బెనెడిక్టుసభ గురువుల పవిత్ర జీవితానికి బాగా ఆకర్షితులయ్యారు. తానుకూడ సన్యాసిగా మారాలని భావించారు.

ఇంతలో వెంటనే ఇంటికి తిరిగి రావాల్సిందిగా తండ్రిగట్టిగా కోరారు. అందువల్ల వారు పట్టణం చేరుకోవాల్సివచ్చింది. అక్కడి మేత్రాసనంలో గురు అభ్యర్ధిగా సేవలందిస్తూ పిమ్మట కాలక్రమంలో తాను కోరుకున్నట్లు గురువుగా అభిషిక్తులయ్యారు. ఆరోజుల్లో 3వ ఓట్స్ చక్రవర్తి రోమునగర సామ్రాజ్యం ఏలుతున్నాడు. ముందు చూపుగలవాడు ఆయన దృష్టి ఎంతో చాకచక్యంగల ఫాదర్ హెరిబెర్డుగారి పై బడింది. వారిని సాదరంగా ఆహ్వానించి తన కొలువులో ప్రధాన సలహాదారు (ఛాన్సలర్) న్యాయాధిపతిగా నియమించుకున్నారు. క్రీ||శ|| 998లో ఈ గురువర్యులే కొలోన్వె ప్రకటింపబడినారు. అంత పెద్ద పదవికి తగనని వారు విన్న వించుకున్నారు.

కాని పెద్దల ఆజ్ఞచొప్పున 998 డిసెంబదు 24న సాయంత్రం పేతురు కథెడ్రలు, కొలోన్యెలో ఆర్చిబిషప్పుగా అభిషేకింపబడి పదవి బాధ్యతలు స్వీకరించారు. ఒకరాజ్య ప్రథమ న్యాయాదిపతి సవినయంగా పదంలహాదారుగా ఉన్నప్పటికిని తమ ఆథ్యాత్మిక కార్యక్రమాలకు ఆటంకం కలుగకుండా పాలించారు. తమ బాధ్యతలనన్నీ సక్రమంగా నెరవేర్చారు. 1002లో 3వ ఓట్టా చక్రవర్తి జర్మనీ నుండి ఇటలీ సందర్శనార్థం వెళూ ఆర్చి బిషప్పు హెరిబెర్టుగార్ని కూడా వెంట బెట్టుకెళ్లారు. దురదృష్టవశాత్తు ఓటో చక్రవరి ఇటలీలోనే పెటెర్నో పట్టణంలో అకస్మాత్తుగా చనిపోయారు. హెరిబెర్లుగారు ఆయన మృతదేహాన్ని స్వదేశం తెచ్చి ఆచెన్ పట్టణంలో ఖననం చేశారు. బవేరియా (జర్మనీ) యువరాజు హెన్రి 2వ హెన్రి చక్రవర్తి పేరుతో ఓట్రో స్థానంకు ఎన్నికయ్యారు. వారు హెరిబెర్టుగారిని అపార్థం చేసుకున్నారు. ఎడముఖం పెడముఖం అయ్యారు.

కాని హెరిబెర్టుగారు తమ పుణ్య జీవితంలోను ప్రజల ఒత్తిడితో పునీతులైన హెన్రిగారు హెరిబెర్డుగారు ఒకరినొకరు సమాధాన పడారు. అపోహలు తొలగిపోగా హెరిబెర్టు ఆర్చిబిషప్ గారే 2వ హెన్రీ చక్రవర్తి ఆస్థానంలో ముఖ్య సలహాదారు ప్రథమ న్యాయాధిపతిగా కొనసాగారు. ఆరోజుల్లో వారు రీన్ మండలంలోని డెయట్టు పట్టణంలో ఒక మఠాలయాన్ని దేవాలయాన్ని కట్టించారు. వారు అన్నివేళలా సమాధానకర్తగా ప్రజలలో పేరుతెచ్చుకున్నారు. వారు పేదలను రోగులను వేరు వేరుదినాల్లో సందర్శించి వారిని ఓదార్చేవారు. ఒక సంవత్సరం తీవ్ర వర్షాభావంవల్ల పంటలు ఎండిపోయి ప్రజలు దుర్భిక్షం ఎదుర్కోలేని పరిస్థితి ఎదురయ్యేటట్టుంది. పునీత హెరిబెర్టుగారు వెంటనే ఒక పాపపశ్చాత్తాప ప్రదక్షిణ నిర్వహించారు. ప్రజలందరు ఇందు పాల్గొన్నారు. ఆ ఊరేగింపు పునీత సెవరిను దేవాలయం చేరుకుంది. అందరూ పునీత హెరిబర్టుగారి నేతృత్వంలో మోకరిల్లారు. వారితోపాటు అందరూ వర్షం కొరకు ఏక స్వరంతో దేవుని ప్రార్థించారు. ఆ క్షణమే కారు మేఘాలు క్రమ్మి కుండపోత వర్షం కురిసింది. పంట పొలాలన్నీ కళకళలాడాయి. ఈ అద్భుతానికి ప్రజలు ఆశ్చర్యపడి హెరిబెర్టుగార్ని వేనోళ్ల పొగిడారు. నేటికిని చాలా చోట్ల రైతులు తగువరం కోసం పునీత హెరిబర్టుగారి మధ్య వర్తిత్వాన ప్రార్థించడం ఆనవాయితీగా వస్తోంది.

 

Add new comment

7 + 2 =

Please wait while the page is loading