CCBI వికార్ జనరల్ల శిక్షణా కార్యక్రమం- గోవా

ఫిబ్రవరి 27న  గోవాలోని, బెనౌలి- CCBI సెక్రటేరియట్ ఎక్స్‌టెన్షన్, శాంతి సదన్ ఏర్పాటు చేసిన వికార్ జనరల్ల  శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా CCBI అధ్యక్షులు, గోవా మరియు డామన్ అగ్రపీఠాధిపతులు కార్డినల్ మహా పూజ్య ఫిలిప్ నెరి గారు "సంఘాల మధ్య సమైక్యతను పెంపొందించాలని" కోరారు.

"సహవాసము అనేది ప్రతి స్థానిక దేవాలయము భాగస్వామ్యాన్ని సూచిస్తుంది, ఇక్కడ వ్యక్తులందరూ తమ ప్రత్యేక వృత్తులను స్వీకరించి, వారి సంబంధిత పాత్రలను నెరవేర్చుకుంటారు" అని ఫిలిప్ నెరి గారు అన్నారు 

13 వివిధ మేత్రాసనాలు నుండి 18 మంది ఈ కోర్సును తీసుకుంటున్నారు, ఇది ఫిబ్రవరి 27న ప్రారంభమై మార్చి 3న ముగుస్తుంది.

జస్టిస్ ఫిలోమెనో మాన్యుయెల్ రీస్, గురుశ్రీ నెల్సన్ సిక్వేరా, గురుశ్రీ బోనిఫేస్ ఫుర్టాడో, బ్రదర్ ఎడ్మోన్ అంటావో, మిస్టర్ సునీల్ గోన్సాల్వేస్, గురుశ్రీ  స్టీఫెన్ అలతారా, గురుశ్రీ రోసారియోలివేరా, గురుశ్రీ బారీ కార్డోజో మరియు గురుశ్రీ డ్యూమింగ్ గోన్‌సాల్వ్‌లతో ఈ శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్నారు.

శిక్షణతో పాటు పాల్గొనేవారు అంతా గోవాలో వివిధ దేవాలయాలను సందర్శించి, పాత గోవాలోని బోమ్ జీసస్ బసిలికాలో దివ్యబలిపూజతో ముగ్గిస్తారు.

గోవాలోని శాంతి సదన్ మేత్రాసన మరియు ప్రావిన్షియల్ స్థాయిలలో ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ కోర్సు, అలాగే వికార్ జనరల్స్ మరియు ఛాన్సలర్‌ల అడ్మినిస్ట్రేషన్ కోర్సు వంటి ప్రత్యేక కోర్సులను అందిస్తుంది.

ఈ కోర్సులు కథోలిక దేవాలయాలో పరిపాలనా మరియు ఆర్థిక అంశాలలో నిమగ్నమైన వ్యక్తుల యొక్క నిర్దిష్ట అవసరాలను తీరుస్తాయి.

Tags