APFC రాయలసీమ ప్రాంతీయ సమావేశం

రాయలసీమ ప్రాంతీయ సంఘం ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ అఫ్ చర్చిస్ (APFC)  కడప జిల్లా యాక్షన్ కమిటీ (DAC) ఏర్పాటుపై 20 ఫిబ్రవరి 2024న కడపలోని క్యాథలిక్ బిషప్ హౌస్‌లో 05.00 నుండి 07.30 గంటల వరకు సంప్రదింపులు జరిపింది. 

కడప అపోస్టోలిక్ అడ్మినిస్ట్రేటర్ మహా పూజ్య గాలి బాలి,కర్నూలు అడ్మినిస్ట్రేటర్ అంథొనప్ప  చౌరప్ప, రాయలసీమ CSI బిషప్ రెవ.ఐజాక్ వరప్రసాద్ మరియు ఇతర EC సభ్యులు ఆధ్వర్యంలో ఈ సంప్రదింపులు జరిగాయి. 
బిషప్‌లు, వివిధ చర్చిల అధిపతులు, గురువులు, పాస్టర్లు, మఠకన్యలు మరియు స్త్రీ పురుషులతో 150 మందికి పైగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

తెలుగు క్రైస్తవ సంఘాల సమాఖ్య (FTC)-ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ అఫ్ చర్చిస్ (APFC) యొక్క లక్ష్యం మరియు కార్యకలాపాలపై వివిధ సలహాలు సూచనలు మరియు DACల ఏర్పాటుపై మార్గదర్శకాల నిర్ణయించారు.

కడప DAC వివిధ చర్చిల ప్రాతినిధ్యాలతో ఏర్పాటు చేయబడింది. 

కడప మేత్రాసన ఎక్యుమెనిజం డైరెక్టర్ గురుశ్రీ ప్రసాదరావుగారికి ఈ సమావేశాన్ని సమర్ధవంతంగా నిర్వహించారు.

Tags