TELUGU CATHOLIC DAILY GOSPEL | అనుదిన దివ్యపూజ పఠనం (08.11.2019)

లూకా సువార్త 16:1-8

 

1. యేసు తన శిష్యులతో ఇట్లు చెప్పెను: "ఒక ధనవంతుని వద్ద గృహ నిర్వాహకుడు ఒకడు ఉండెను. అతడు యజమాని సంపదను వృధా చేయుచున్నాడని అతనిపై నేరము మోపబడెను.
2. యజమాని అతనిని పిలిచి, "నిన్ను గూర్చి నేను వినుచున్నది ఏమిటి? లెక్కలు అప్పగింపుము. ఇకపై నీవు గృహనిర్వాహకుడుగ ఉండ వీలుపడదు' అని చెప్పెను.
3. అతడు లోలోపల ఇట్లు అనుకొనెను: 'ఇపుడు నేనేమి చేయుదును? యజమానుడు నన్ను ఈ పదవి నుండి తొలగించు చున్నాడు. శ్రమించుటకు నాకు శక్తిలేదు. బిచ్చమెత్తుటకు నాకు సిగ్గుగ ఉన్నది.
4. గృహ నిర్వాహకత్వము నుండి తొలగింపబడినప్పుడు అందరి వలన ఆశ్రయము పొందుటకు నేను ఇట్లు చేసెదను" అని,
5. యజమాని ఋణస్థులను ఒక్కొక్కరిని పిలిపించి, మొదటి వానితో 'నీవు నా యాజమానికి ఎంత ఋణపడి ఉన్నావు?” అని అడిగెను.
6. వాడు 'నూరు మణుగుల నూనె' అని చెప్పెను. అపుడు అతడు వానితో నీ ఋణ పత్రము తీసికొని, వెంటనే దానిపై ఏబది అని వ్రాసికొనుము' అని చెప్పెను.
7-8.అంతట అతడు రెండవ వానితో "నీవు ఎంత ఋణపడి ఉంటివి? అని అడిగెను. వాడు 'నూరు తూముల గోదుమలు' అని బదులు పలికెను. అపుడు వానితో "నీ ఋణ పత్రము తీసికొని ఎనుబది అని వ్రాసికొనుము' అనెను. ఆ గృహనిర్వాహకుడు యుక్తిగ వర్తించినందులకు యజమాని వానిని మెచ్చుకొనెను. ఏలన, ఈ తరమున ఈ లోక సంబంధులైన ప్రజలు వెలుగు సంబంధులగు ప్రజల కంటె యుక్తిపరులు.

Add new comment

5 + 2 =

Please wait while the page is loading