TELUGU CATHOLIC DAILY GOSPEL | అనుదిన దివ్యపూజ పఠనం (07.11.2019)

లూకా సువార్త 15:1-10

 

1.సుంకరులు, పాపులు అందరు యేసు బోధలను వినుటకు ఆయన వద్దకు వచ్చుచుండిరి.
2. అది చూచి పరిసయ్యులు, ధర్మశాస్త్రబోధకులు “ఇతడు పాపులను చేరదీయుచు, వారితో కలిసి భుజించుచున్నాడు" అని సణుగుకొనసాగిరి.
3. అపుడు యేసు వారికి ఒక ఉపమానమును ఇట్లు చెప్పెను;
4."ఒకడు తనకు ఉన్న నూరు గొఱ్ఱెలలో ఒకటి తప్పి పోయినచో, తక్కిన తొంబది తొమ్మిదింటిని ఆ అరణ్యముననే విడిచిపెట్టి దానిని వెదకుటకై పోవునుగదా!
5. అది దొరికిన పిమ్మట వాడు సంతోషముతో దానిని భుజములపై వేసికొని, యింటికి తీసికొని వచ్చి తన మిత్రులను, ఇరుగు పొరుగు వారిని పిలిచి,
6. తప్పిపోయిన నా గొఱ్ఱెదొరకినది. నాతోపాటు ఆనందింపుడు' అని చెప్పును .
7.అట్లే పశ్చాత్తాపము అవసరము లేని తొంబది తొమ్మిది మంది నీతిమంతుల కంటె, హృదయ పరివర్తన పొందు ఒక పాపాత్ముని విషయమై పరలోకమున ఎక్కువ ఆనందము ఉండునని" నేను మీతో చెప్పుచున్నాను.
8.“పది వెండి నాణెములున్న స్త్రీ అందులో ఒకటి పోగొట్టుకొనిన యెడల దీపము వెలిగించి, ఇల్లు ఊడ్చి, అది దొరుకు వరకు పట్టుదలతో వెదకదా?
9. అది దొరకగనే స్నేహితురాండ్రను, ఇరుగు పొరుగు స్త్రీలను చేరబిలిచి "నాతోపాటు ఆనందింపుడు. నేను పోగొట్టుకొనిన నాణెము దొరకినది" అని చెప్పును .
10. అట్లే హృదయ పరివర్తన చెందు ఒక పాపాత్ముని విషయమై దేవదూతలు సంతోషింతురు' అని మీతో చెప్పుచున్నాను.

Add new comment

1 + 0 =

Please wait while the page is loading