Radio Veritas Asia Buick St., Fairview Park, Queszon City, Metro Manila. 1106 Philippines | + 632 9390011-15 | +6329390011-15
TELUGU CATHOLIC DAILY GOSPEL || అనుదిన దివ్యపూజ పఠనం (03.12.2019)

Thursday, November 28, 2019
లూకా సువార్త 10:21-24
21. ఆ గడియలోనే యేసు పవిత్రాత్మ యందు ఆనందించి, "ఓ తండ్రీ! పరలోక భూలోకములకు అధిపతీ! ఈ విషయములను నీవు జ్ఞానులకు, వివేకులకు మరుగు పరచి పసి బిడ్డలకు వీనిని తెలియ పరచినందుకు నీకు ధన్యవాదములు. అవును తండ్రీ ! ఇది నీ అనుగ్రహ పూర్వక సంకల్పము.
22.నా తండ్రి నాకు సమస్తము అప్పగించి యున్నాడు. తండ్రి తప్ప మరెవ్వరు కుమారుని ఎరుగరు. కుమారుడు తప్ప మరెవ్వరు తండ్రిని ఎరుగరు. మరియు కుమారుడు ఎవరికి ఎరిగింప ఇష్టపడునో వారు మాత్రమే తండ్రిని ఎరుగుదురు" అనెను.
23. అపుడు యేసు శిష్యులవైపు తిరిగి వారినుద్దేశించి "మీరు చూచెడి ఈ సంఘటనలను చూడగలిగిన నేత్రములు ఎంత ధన్యమైనవి!
24.ప్రవక్తలు, రాజులు అనేకులు మీరు చూచుచున్నవి చూడ గోరిరి. కాని చూడలేకపోయిరి. మీరు వినుచున్నవి వినగోరిరి. కాని వినజాలకపోయిరి" అని పలికెను.
Add new comment