Daily Gospel l Daily Reflections |అనుదిన దివ్యపూజ పఠనం(14.08.2019 )

మత్తయి సువార్త 18:15-20

15. 'నీ సోదరుడు నీకు విరుద్దముగ తప్పిదము చేసిన యెడల నీవు వెళ్లి అతనికి తన దోషములను ఒంటరిగా నిరూపించి బుద్ధి చెప్పుము. నీ మాటలు అతడాలకించిన యెడల వానిని నీవు సంపాదించుకొనిన వాడవగుదువు.
16. నీ మాటలను అతడు ఆలకింపని యెడల ఒకరిద్దరిని నీ వెంట తీసికొనిపొమ్ము ఇట్లు ఇద్దరు ముగురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపడును.
17. వారి మాట కూడ వినని యెడల సంఘమునకు తెలుపుము. ఆ సంఘమును కూడ అతడు లెక్కింపని యెడల, వానిని అవిశ్వాసునిగ, సుంకరిగ పరిగణింపుము.
18. భూలోకమందు మీరు వేనిని బంధింతురో అవి పరలోక మందు బంధింపబడును. భూలోకమందు మీరు వేనిని విప్పుదురో అవి పరలోక మందు విప్పబడునని మీతో నిశ్చయముగ చెప్పుచున్నాను.
19. భూలోకమున మీలో ఇద్దరు ఏక మనస్కులై ఏమి అడిగినను, పరలోక మందుండు నా తండ్రి వారికి దానినొసగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
20. ఏలన, ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు నా పేరట కూడుదురో అక్కడ నేను వారి మధ్య ఉన్నాను" అనెను.

Add new comment

5 + 15 =

Please wait while the page is loading