Daily Gospel |అనుదిన దివ్యపూజ పఠనం(12.09.2019 )

లూకా సువార్త 6:27-38

27. "కానీ, మీతో నేను చెప్పునది ఏమన: మీ శత్రువును ప్రేమింపుడు. మిమ్ము ద్వేషించు వారికి మేలు చేయుడు.
28.మిమ్ము శపించు వారిని ఆశీర్వదింపుడు. మిమ్ము బాధించు వారికై ప్రార్ధింపుడు.
29.నిన్ను ఒక చెంప పై కొట్టిన వానికి రెండవ చెంప కూడ చూపుము. నీ పైబట్టను ఎత్తుకొనిపోవు వానిని నీ అంగీని కూడ తీసికొని పోనిమ్ము
30. నిన్ను అడిగిన ప్రతివానికి ఇమ్ము నీ సొత్తు ఎత్తుకొనిపోవు వానిని తిరిగి అడుగవలదు.
31. ఇతరులు మీకు ఎట్లు చేయవలెనని మీరు కోరుదురో అట్లే మీరు ఇతరులకు చేయుడు.
32. మిమ్ము ప్రేమించిన వారిని మాత్రమే మీరు ప్రేమించినచో మీ ప్రత్యేకత ఏమి? పాపులు సహితము అట్లు చేయుట లేదా?
33. ఉపకారికి మాత్రమే ప్రత్యుకారము చేసిన యెడల మీ ప్రత్యేకత ఏమి? పాపులు సహితము అట్లు చేయుట లేదా?
34. తిరిగి ఈయగల వారికే ఋణమిచ్చుటలో మీ ప్రత్యేకత ఏమి? పాపులు పాపులకును అట్లు ఇచ్చుటలేదా?
35.కనుక, మీరు మీ శత్రువులను ప్రేమింపుడు. వారికి మేలు చేయుడు. అప్పు ఇచ్చి తిరిగి పొందవలెనని ఆశపడకుడు. అపుడు మీకు గొప్ప బహుమానము లభించును. మీరు సర్వోన్నతుడగు దేవుని బిడ్డలగుదురు. ఏలయన, ఆయన కృతజ్ఞత లేని వారికి దుష్టులకు మేలు చేయును.
36.మీ తండ్రి వలే మీరును కనికరము గలవారై యుండుడు.
37. "పరులను గూర్చి మీరు తీర్పు చేయకుడు. మిమ్ము గూర్చి తీర్పు చేయబడదు. పరుల ను ఖండింపకుడు అపుడు మీరు ఖండింప బడరు.
38.పరులను క్షమింపుడు మీరు క్షమింప బడుదురు. పరులకు మీరు ఒసగుడు. మీకు ఒసగ బడును. కుదించి, అదిమి, పొర్లిపోవు నిండు కొలమానముతో ఒసగబడును. మీరు ఏ కొలతతో కొలుతురో, ఆ కొలతతోనే మీకు కొలువ బడును? అని యేసు పలికెను.

Add new comment

5 + 10 =

Please wait while the page is loading