Daily Gospel |అనుదిన దివ్యపూజ పఠనం (08.10.2019)

లూకా సువార్త 10:38-42

38.వారు ప్రయాణము చేయుచుండ యేసు ఒక గ్రామమునకు వచ్చెను. అచ్చట మార్త అను ఒక స్త్రీ ఆయనను తన ఇంటికి ఆహ్వానించెను.
39. ఆమెకు మరియ అను ఒక సోదరి కలదు. ఆమె ప్రభువు పాదముల చెంత కూర్చుండి ఆయన బోధలు వినుచుండెను.
40. మార్త పెక్కు పనులతో సతమత మగుచు ఆయన యొద్దకు వచ్చి 'ప్రభూ! నా సోదరి పనులన్ని నాపై వదలి మీ చెంత కూర్చొని ఉండుట మీరు గమనించుట లేదా? నాకు సహాయము చేయుటకు ఆమెను పంపుడు” అనెను.
41. అందుకు యేసు "మార్త మార్త! నీవు ఎన్నో పనులను గూర్చి విచారించుచు ఆతురతపడుచున్నావు.
42.కాని అవసరమైనది ఒక్కటే. మరియ ఉత్తమమైన దానిని ఎన్నుకొనినది. అది ఆమె నుండి అది తీసివేయ బడదు” అని సమాధానమిచ్చెను
.

Add new comment

1 + 7 =

Please wait while the page is loading